November 4, 2014

కార్తీక పూర్ణిమ

కార్తీక పూర్ణిమ
కార్తీక పూర్ణిమ దీపాలు
భారతీయ సాంస్కృతిక 
వెలుగులకు తార్కాణాలు!
శివాలయాల్లో వెలిగించెడి
దీపాలు భక్తుల ఆధ్యాత్మిక
ఉన్నతికి సోపానాలు!
కార్తీక శివారాధనలు
భక్తుల మనోభీష్ట సిద్ధికి
సత్ సంకల్పాలు!
భారతీయ ఆధ్యాత్మిక
తరంగాలు విశ్వ గమనాన్ని
నిర్దేశించే సృష్టి-లయ కారాలు!!!
ఓం.నమఃశివాయ
                                                                              ***కటారు.మహేశ్వర్ రెడ్డి..తాడిపత్రి..


October 17, 2014

జన్మభూమి -- మా ఊరు

రండి కదలి రండి
జన్మభూమి పిలుస్తోంది
రండి కలసి రండి
ఉన్న ఊరు అడుగుతోంది!

 చేయి చేయి కలిపిమనం
చరిత్రనే సృష్టిద్దాం
”అన్న” గారి అడుగుల్లో
అడుగులు వేసేద్దాం
”తాడిపత్రి” గొప్పతనం
జగమంతా చాటేద్దాం!!
                          || రండి||
పచ్చదనం - పరిశుభ్రత
ప్రగతికి తొలిమెట్టు
కష్టాలెన్నున్నా
జన్మభూమిని నిలబెట్టు
” స్వచ్ఛ తాడిపత్రి” వాసిగా
సగర్వంగా తల పైకెత్తు !!
                                      # కటారు.మహేశ్వర్ రెడ్డి.
                                        .శ్రీ సత్యసాయి తెలుగుపండిత శిక్షణ కళాశాల.
                                          తాడిపత్రి..

October 11, 2014

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్

"స్వచ్ఛ భారత్ నీకోసం నాకోసం
మనందరి కోసం!
స్వచ్ఛంగా ఉంచు నీదేశాన్ని
అచ్చంగా నీ ఇంటిలా!
పరిసరాలు ఏవైనా పరిశుభ్రత మాత్రం
నీది నాది మనందరిది!
గుడి అయినా బడి అయినా
పరిశుభ్రత మనభాద్యత!
రండి!కదలండి!కలసిరండి!
గాంధీజీ కలలు కన్న
స్వచ్ఛ భారత్ ను నిర్మించుకుందాం!
మన జె.సి.సార్ మార్గంలో నడుద్దాం!
"నమో" ఆశయాన్ని కొనసాగిద్దాం!!!!
                                 ********** కటారు.మహేశ్వర్ రెడ్డి.తాడిపత్రి.

October 10, 2014

స్వఛ్ఛ భారత్

స్వఛ్ఛ భారత్

స్వఛ్ఛ భారత్ నీ కోసం
నా కోసం మనందరికోసం
స్వచ్ఛంగా ఉంచు నీ దేశాన్ని
అచ్చంగా నీ ఇంటి లాగా
పరిసరాలు ఏవైనా 
పరిశుభ్రత మాత్రం
నీది నాది మనందరిది
గుడి అయినా బడి అయినా
వీధి అయినా విల్లా అయినా
వెనువెంటనే శుభ్రంచేద్దాం
రండి కదలండి !కలసి రండి!
గాంధీజీ కలలు కన్న
స్వచ్ఛ భారత్ ను స్వేచ్ఛ భారత్ ను
నిర్మించుకుందాం.!!!!
                                                                                                  @ కటారు.మహేశ్వర్ రెడ్డి..తాడిపత్రి..

June 27, 2014

ఓ ఋతుపవనమా!


ఓ ఋతుపవనమా
ఒక సారి ఇటు చూడుమా
ప్రచండ వేసవి ప్రతాపంతో      
ఉక్కిరి బిక్కిరి అయిన మాకు
తొలకరి చినుకులతో సేద
తీరుస్తావను కొన్నాము
నీ జాడ కోసం ఎదురు చూసే
రైతన్నల ముఖాల్లో
వెలుగు జల్లులు ఎప్పుడు
నింపాలను కుంటున్నావు
ఓ ఋతుపవనమా
నీ మీద ఆధార పడ్డ మాకు
ఆశలు నిరాశలేనా..
ఓ జాలి లేని ఋతుపవనమా
మాపై కక్షబూనడం న్యాయమా!!
 


June 25, 2014

యల్ నినో

యల్ నినో
మన ఖండమూ కాదు
మనకు దగ్గరగా కూడా లేదు
కానీ ఈ రాక్షసి మన రైతులకు
కంటి మీద కునుకు లేకుండా
చేస్తుంది!కలవరపెడుతోంది
అధికార పక్షానికి వణుకు
పుట్టిస్తోంది!దడ పుట్టిస్తోంది
ప్రతిపక్షాలకు పనికల్పిస్తోంది
ఇంతకు ఎవరది?ఏంటది?
అది ఫసిఫిక్ మహా సముద్రం
ప్రశాంత సముద్రం మాత్రం కాదు
తన లోపల దాచుకున్న
బడబాగ్నిని భారత దేశం పైకి
వేడి గాలుల రూపంలో
వెదజల్లుతున్న జల రాక్షసి
అదే మనం పిలుస్తున్న
"యల్ నినో".............
ఓ భగవంతుడా కరుణించు
కాపాడు నా రాష్ట్రాన్ని,రక్షించు
నా ప్రజలను..................................కటారు మహేశ్వర్ రెడ్డి.....


June 17, 2014

నైఋతి ఋతుపవనాలు

నైఋతి ఋతుపవనాలు-రైతుల దిగాలు
చిన్నప్పటి గురుతులు
వేసవి శెలవుల అనంతరం
పాఠశాల పునఃప్రారంభం
అవుతుందంటే ఆకాశం
నిండా నల్లని మబ్బుల
గుంపులు చల్లని గాలులు
నాకు తెలియదు అవి 
ఋతుపవనాలని,ఆనందించేవాన్ని
ఆస్వాదించేవాన్ని,కానీ నా కన్నా
ఆనందించే వాళ్ళు రైతులని
నాకు తెలియదు, కానీ ఆ 
ఆనందాలు ఇుపుడు లేవు
రైతులు ఆకాశం వంక చూచి,చూచి
కళ్ళు కాయలు కాస్తున్నా
ఆశ లు ఆవిరి కానివ్వడం లేదు
ఓ ప్రకృతి మాతా కరుణించి
మా రైతుల పాలిట కరుణ "వర్షం"
అపారంగా వర్షిస్తావని ఆశగా ఎదురు
చూస్తూ.........................ఓ రైతు ప్రేమికుడు....

June 7, 2014

ఆదర్శ తాడిపత్రి

                     
ఆదర్శ తాడిపత్రి
ఆకాశంలో ఒకే సూర్యుడున్నాడు
కానీ మా తాడిపత్రి లో ఇద్దరు సూర్యులు ఉన్నారు
ఉష:కిరణాల్లా ఊరంతా వెలుగులు
పచ్చటి తోరనాల్లా రోడ్లకు ఇరువైపులా మొక్కల పెంపకం
ప్లాస్టిక్ నిషేధంలో దేశంలోనే పేరు ప్రఖ్యాతులు
చెత్తపై సమరం చేసే మా తాడిపత్రి ప్రజలు
రాష్ట్రానికే గర్వకారణం
సుందరమైన రహదారులు-రాయల కాలం నాటి దేవాలయాలు
తాడిపత్రి కే తలమానికాలు
విస్తారమైన పండ్లతోటలు-ప్రఖ్యాతి గాంచిన నాపరాళ్ళ పరిశ్రమలు
ఎందరికో జీవనాధారం మా తాడిపత్రి ఆవాసం
ఇంత అధ్బుతమైన పట్టణ సృష్టికర్తలే
మా ఇద్దరు సూర్యులు
మా ఊరి వెలుగులు
వారే
శ్రీ.జేసి.దివాకర రెడ్డి -శ్రీ.జేసి.ప్రభాకర రెడ్డి    
మా తాడిపత్రి పట్టణాన్ని   అభివృధ్ది చేసిన మా ప్రియతమ నాయకుడు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యునిగా ప్రమాణస్వీకారం చేయు సంధర్భంగా      
శ్రీ జేసీ.ప్రభాకర రెడ్డి గారికి మా శుభాకంక్షలు...
ఇట్లు---
కటారు మహేశ్వర రెడ్డి,,--డాక్టర్.టియస్.మహబూబ్ భాషా.....తాడిపత్రి                       

May 17, 2014

ఇద్దరు చంద్రుల కథ!

ఇద్దరు చంద్రుల కథ!!


అలనాటి మిత్రులు
అందమైన చంద్రులు
అందరి కంటే ఘనులు
అపురూప వారసులు
అమావాస్యపు రోజులు
అడ్డంతొలగిన ఘడియలు
అందమైన సీమాంధ్రకు
అందాల వెలుగులు
అంకురించిన తెలంగాణాకు
అనుకోని హరివిల్లులు
అందివచ్చిన అవకాశాలు
అందుకోండి కిరీటాలు
అందరికీ మేలు చెయ్యండి
అధ్బుతాలు సృష్టించండి !!!
@@@@ ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి,
@@@@ తెలంగాణ  తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి,,
@@@@@@@@@@@@@@@ అభినందనలతో మీ అభిమాని..కటారు మహేశ్వర రెడ్డి,  తాడిపత్రి...


March 24, 2014

పొట్టి కవితలు

పొట్టి కవితలు
నోటుకు
ఓటు
తెరచాటు
వెన్నుపోటు
                          కుర్చీ కి మన మిచ్చే లైసెన్స్!!

తాళపత్ర
గ్రంధాలు
వేదాలు
ఉపనిషత్తులు
               స్వదేశీయులు మరిస్తే
               విదేశీయులు సోధిస్తున్నారు !!

యన్టీఆర్
వైయసార్
అవసరానికి వాడుకోవడానికి
ఆటంబాంబులాంటి సరుకు!!

శఠగోపం
వస్తువు ఒకటే
భక్తులకు
అమాయకులకు తేడాలేదు!!           

February 19, 2014

సీమాంధ్ర

మా సీమ ఆంధ్ర
మేము రాయలసీమ బిడ్డలము
పౌరుషానికి రోషానికి వారసులము
రాష్ట్రాన్ని చీల్చారు గానీ
రహదారులను చీల్చలేరు
బౌండరీస్ గీయవచ్చు గాని
బతుకును శాసించలేరు
తెగింపు మా విధానం
ఆత్మగౌరవమే ప్రధానం
బంతిని నేలకేసి కొడితే
అంతే వేగంగా పైకి లేస్తుంది
రాయలసీమ వాసులను
అమాయకులుగా పరిగనిస్తే
రాయలసీమ రుచులు
చవి చూడవలసివస్తుంది
ఆంధ్ర వాళ్ళు రాయలసీమ వాళ్ళు
కలకాలం కలసి ఉంటే
మన వెంటే భారతదేశం!!!