June 27, 2014

ఓ ఋతుపవనమా!


ఓ ఋతుపవనమా
ఒక సారి ఇటు చూడుమా
ప్రచండ వేసవి ప్రతాపంతో      
ఉక్కిరి బిక్కిరి అయిన మాకు
తొలకరి చినుకులతో సేద
తీరుస్తావను కొన్నాము
నీ జాడ కోసం ఎదురు చూసే
రైతన్నల ముఖాల్లో
వెలుగు జల్లులు ఎప్పుడు
నింపాలను కుంటున్నావు
ఓ ఋతుపవనమా
నీ మీద ఆధార పడ్డ మాకు
ఆశలు నిరాశలేనా..
ఓ జాలి లేని ఋతుపవనమా
మాపై కక్షబూనడం న్యాయమా!!
 


June 25, 2014

యల్ నినో

యల్ నినో
మన ఖండమూ కాదు
మనకు దగ్గరగా కూడా లేదు
కానీ ఈ రాక్షసి మన రైతులకు
కంటి మీద కునుకు లేకుండా
చేస్తుంది!కలవరపెడుతోంది
అధికార పక్షానికి వణుకు
పుట్టిస్తోంది!దడ పుట్టిస్తోంది
ప్రతిపక్షాలకు పనికల్పిస్తోంది
ఇంతకు ఎవరది?ఏంటది?
అది ఫసిఫిక్ మహా సముద్రం
ప్రశాంత సముద్రం మాత్రం కాదు
తన లోపల దాచుకున్న
బడబాగ్నిని భారత దేశం పైకి
వేడి గాలుల రూపంలో
వెదజల్లుతున్న జల రాక్షసి
అదే మనం పిలుస్తున్న
"యల్ నినో".............
ఓ భగవంతుడా కరుణించు
కాపాడు నా రాష్ట్రాన్ని,రక్షించు
నా ప్రజలను..................................కటారు మహేశ్వర్ రెడ్డి.....


June 17, 2014

నైఋతి ఋతుపవనాలు

నైఋతి ఋతుపవనాలు-రైతుల దిగాలు
చిన్నప్పటి గురుతులు
వేసవి శెలవుల అనంతరం
పాఠశాల పునఃప్రారంభం
అవుతుందంటే ఆకాశం
నిండా నల్లని మబ్బుల
గుంపులు చల్లని గాలులు
నాకు తెలియదు అవి 
ఋతుపవనాలని,ఆనందించేవాన్ని
ఆస్వాదించేవాన్ని,కానీ నా కన్నా
ఆనందించే వాళ్ళు రైతులని
నాకు తెలియదు, కానీ ఆ 
ఆనందాలు ఇుపుడు లేవు
రైతులు ఆకాశం వంక చూచి,చూచి
కళ్ళు కాయలు కాస్తున్నా
ఆశ లు ఆవిరి కానివ్వడం లేదు
ఓ ప్రకృతి మాతా కరుణించి
మా రైతుల పాలిట కరుణ "వర్షం"
అపారంగా వర్షిస్తావని ఆశగా ఎదురు
చూస్తూ.........................ఓ రైతు ప్రేమికుడు....

June 7, 2014

ఆదర్శ తాడిపత్రి

                     
ఆదర్శ తాడిపత్రి
ఆకాశంలో ఒకే సూర్యుడున్నాడు
కానీ మా తాడిపత్రి లో ఇద్దరు సూర్యులు ఉన్నారు
ఉష:కిరణాల్లా ఊరంతా వెలుగులు
పచ్చటి తోరనాల్లా రోడ్లకు ఇరువైపులా మొక్కల పెంపకం
ప్లాస్టిక్ నిషేధంలో దేశంలోనే పేరు ప్రఖ్యాతులు
చెత్తపై సమరం చేసే మా తాడిపత్రి ప్రజలు
రాష్ట్రానికే గర్వకారణం
సుందరమైన రహదారులు-రాయల కాలం నాటి దేవాలయాలు
తాడిపత్రి కే తలమానికాలు
విస్తారమైన పండ్లతోటలు-ప్రఖ్యాతి గాంచిన నాపరాళ్ళ పరిశ్రమలు
ఎందరికో జీవనాధారం మా తాడిపత్రి ఆవాసం
ఇంత అధ్బుతమైన పట్టణ సృష్టికర్తలే
మా ఇద్దరు సూర్యులు
మా ఊరి వెలుగులు
వారే
శ్రీ.జేసి.దివాకర రెడ్డి -శ్రీ.జేసి.ప్రభాకర రెడ్డి    
మా తాడిపత్రి పట్టణాన్ని   అభివృధ్ది చేసిన మా ప్రియతమ నాయకుడు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యునిగా ప్రమాణస్వీకారం చేయు సంధర్భంగా      
శ్రీ జేసీ.ప్రభాకర రెడ్డి గారికి మా శుభాకంక్షలు...
ఇట్లు---
కటారు మహేశ్వర రెడ్డి,,--డాక్టర్.టియస్.మహబూబ్ భాషా.....తాడిపత్రి