July 29, 2015

కలాం గారికి కవితాంజలి

శ్రీ.ఏ.పి.జె.అబ్దుల్ కలాం
మా తుఝే సలాం
రామేశ్వరంలో ఉద ఇంచిన
అపర త్రిమూర్తులు మీరు
భరతమాత బిడ్డలకు
భాగ్యవిధాత మీరు
పదవులకే వన్నె తెచ్చిన
ప్రతిభాశాలి మీరు
ప్రపంచంచే కీర్తించబడ్డ
విశ్వరత్న మీరు
షిల్లాంగ్ లో( అస్తమయం)
కాదు విరామం!మళ్ళీ
మీరు తప్పక ఉదఇస్తారు
శ్రీ.ఏ.పి.జె.అబ్దుల్ కలాం
మా తుఝే సలాం!!!
                              @కటారు.మహేశ్వర రెడ్డి.@

July 11, 2015

పుష్కర గోదావరి

పుష్కర గోదావరి

గోదావరి గోదావరి,గోదావరి గోదావరి
పుష్కరాల పుణ్యనదీ గోదావరి
తెలుగు వారి జీవ నదీ గోదావరి
ఆంద్రుల అన్నపూర్ణ మన గోదావరి
తర తరాల జల బంధం మన గోదావరి
                                  !!గోదావరి!!
నాసికా త్ర్యంబకం పుట్టినిల్లుగా
తూ.గోజీ,ప.గోజీ మెట్టినిల్లుగా
కొండలు కోనలు దాటి
వాగులు వంకలు కలుపుకొని
గల గలా గోదారి తెలుగు ప్ర"జల" విహారి
                                    !!గోదావరి!!
పుష్కర సమయాన పుణ్యనదీ స్నానం
జన్మ జన్మాంతర పాప పరిహారం
జన్మ జన్మలకు సకల శుభదాయకం
రండి గోదారమ్మకు స్వాగతం పలుకుదాం
పుష్కర యాత్రకు శ్రీకారం చుడదాం.!!
                                       ...కటారు.మహేశ్వర రెడ్డి.

February 21, 2015

మన మాతృ భాష

మన మాతృభాషను మరువకు
అమ్మ భాషను వదలకు
తేనెలొలికే తెలుగు భాషను
ఎల్లకాలం వదలకు!
తెలుగు వెలుగే ప్రజల వెలుగు
మాతృభాషకు మనసు కరుగు!
< తెలుగు భాషాభిమాని> కటారు.మహేశ్వర రెడ్డి.
@@మాతృభాషా దినోత్సవ శుభాకంక్షలు@@

మన మాతృ భాష

మన మాతృ భాష
మన మాతృ భాషను మరువకు
అమ్మ భాషను వదలకు!
అందమైన మన తెలుగు భాషను
అందరికి పంచుదాం!అందరిలో పెంచుదాం!
తెలుగు వెలుగే ప్రజల వెలుగు
తెలుగు పలుకే మొదటి అడుగు!
అమ్మ అడుగే దానికి ముందడుగు!!
                                      !!తెలుగు భాషాభిమాని!!
@@ మాతృభాష దినోత్సవ సందర్భముగా అందరికీ శుభాకంక్షలు@@
       

January 31, 2015

మహీ నానీ లు
 1. కొత్త రాష్ట్రంలో
    కాకులు కూడా లేవు
    వాటికీ తెలిసి పోయింది
     రాష్ట్ర ఆర్థిక పరిస్థితి!!
2.  నిలకడ లేని తనం
     ఎవరికి సరిపోతుంది
     ఇంకెవరికి మన
     భారత క్రికెట్ జట్టు కే!!
3. పీ.కే.
    సినిమా పై
    రాద్దాంతం
    పని లేని వారికి వినోదం!!
4. రాయల సీమ
    పైన అన్నీ రాళ్ళే!
    పాతాళంలో
    నీళ్ళు!!
5. పల్లెల్లో
    వెతకండి!
    మీకే తెలుస్తుంది
    అన్నదాత ఏం తింటున్నాడో!!
6. ఎర్ర చందనం
    పోలీసులు
    వదలినా
    ఏడు కొండల వాడు వదలడు!!

మహీ నా నీ లు

మహీ నా నీ లు
1. బుర్ర
    వేడెక్కిందా
    కాఫీ కోసం
    వెంపర్లాట !!
2. మతం
    చుట్టూ పార్టీలు
    బిగుసు కుంటోంది
    భరతమాతకు ఉచ్చు!!
3. స్వచ్ఛ భారత్
    ఫోటోలకు ఫోజులు
    ఇవ్వడం కాదు
    చేతల్లో చూపించాలి!!
4. ఎంత విసిగించినా
    సడలని భక్తి
    మా తిరుమల
    శ్రీ వేంకటేశ్వర స్వామి పై!!
5. అందని ద్రాక్ష(ఋణ మాఫీ)
    పుల్లన! నక్కకు కాదు!
    ఆంధ్ర ప్రదేశ్
    రైతన్నలకు!!
6. ఆధ్యాత్మికత
    అడు గంటిందా
    బ్ర్హహ్మశ్రీ.చాగంటి వారిని
    శరణు జొచ్చండి!!
                                       ॒@@@.కటారు.మహేశ్వర రెడ్డి..

January 29, 2015

మాఘ మాసం

మాఘ మాసం
మాఘ మాసం
ఈశ్వరేోపాసనకు
శుభమాసం శివ
భక్తులకు పరమ
పవిత్ర మాసం!!











January 18, 2015

తర తరాల సంక్రాంతి

తర తరాల సంక్రాంతి
తరాలు మారినా సంస్కృతులు
మారలేదు!మకర సంక్రమణం
జరిగినా మనుషులు మారలేదు!
సంబరాల సంక్రాంతులు ఆగడం
లేదు!మన పల్లె సీమల పండుగ
వాతావరణం ప్రపంచంలో ఎక్కడ
వెతికినా కనపడదు!కోడి పందేలు
ఎడ్ల పందేలు,కుర్రకారు కేరింతలు
రంగుల రంగవల్లులు,అమ్మాయిల
గొబ్బెమ్మల పాటలు,హరిదాసు
సంకీర్తనలు,గంగిరెద్దుల గారడీలు
ఎటు చూసినా ఆనంద హేళలు!
ఏమిటో ఈ సంక్రాంతి మహత్మ్యం
ఈ పండుగ వొచ్చిందంటే
నగరాలు ఖాలీ!పట్టణాలు ఖాలీ
పనులన్నీ పక్కనబెట్టి పల్లె బాటలు
పడతారు మన తెలుగు ప్రజలు!
సంక్రాంతి అంటే  "సం- క్రాంతి" ఉన్నట్లే!!