December 31, 2012

నూతన సంవత్సర వేడుకలకు స్వాగతం

వస్తోంది నూతన సంవత్సరం
తేవాలి నూతన ఉత్తేజం
వర్షించాలి అందరిలో ఆనందం
సాగాలి మన నవజీవన ప్రయాణం!!
నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు

బ్లాగు మిత్రులందరికి శుభాకాంక్షలు

December 25, 2012

మహీ కవితలు

మహీ కవితలు

రెడ్డి గారు
పోయారు
మన రాష్ట్రం
రావణ కాష్టం!!

ఐ పీ యల్ విషం
నర నరాలకు ఎక్కి
క్రికెట్ ప్రాణం
తీసేసింది!!

మానవత్వం
మంటంగలసిందా
సమాజానికి
ఇప్పుడే మెలకువచ్చినట్లుంది!!

కోకో కోలా!
కొబ్బరి నీళ్ళా!
తేల్చుకో?
విషం కావాలో-అమృతం కావాలో!!

సామాజిక కవితలు

మన తెలుగు
భాషకు
దూరమవుతున్న
చిన్నారులు
                           అంతా
                            కాన్సెప్టు   మాయ!!


క్రికెట్
బెట్టింగ్
విడదీయని
అనుబంధం
                              
                          జూదానికీ
                          హద్దు ఉంటుంది!!

రచ్చ బండ
ముచ్చట్లు
నాటి కాలపు
గురుతులు
                          నేడు టెలివిజన్
                           ఎదుట బందీలు!!


ఆత్మ
శాశ్వతం
శరీరం
అశాశ్వతం
                        నిన్నునీవు తెలుసుకో
                        అంటుంది వేదాంతం!!

సంసారం
సాగరం
రెండూ
ఒకటే
                       లోతెంతో
                       ఎవరికీ తెలియదు!! 
          

సామాజిక కవితలు

సామాజిక కవితలు

స్కానింగ్ లో
తెలిసింది
అమ్మాయి
అని
               చిదిమేశారు
               కలికాలపు కర్కశత్వం!!


మన తె

December 22, 2012

మా చిట్టి అల్లుడు హర్షిత్ కోసం




పిల్లల పల్లి పిల్లోడు

అమెరికాలో ఉన్నాడు

కర్లి కర్లి జుత్తోడు

కరోలినాలో ఉన్నాడు

'బాలు-రాధ' ల బాలక్రిష్ణుడు

బుడి బుడి నడకల

బుద్ది మంతుడు

'క్రిష్ణ-మహేష్' ల

ముద్దుల అల్లుడు

ముద్దు మురిపాల

మువ్వ గోపాలుడు!!!

మా చిట్టి అల్లుడు హర్షిత్ కోసం


మా చిట్టి అల్లుడు హర్షిత్ కోసం


పిల్లల పల్లి పిల్లోడు
అమెరికాలో ఉన్నాడు
కర్లి కర్లి జుత్తోడు
కరోలినాలో ఉన్నాడు
బాలు-రాధ ల బాలక్రిష్ణుడు
బుడి బుడి నడకల
బుద్ది మంతుడు
క్రిష్ణ-మహేష్ ల
ముద్దుల అల్లుడు
ముద్దు మురిపాల
మువ్వ గోపాలుడు!!!

December 21, 2012

మహి పొట్టి కవితలు

మహి పొట్టి కవితలు


హైదరాబాద్
ఖాళీ
సంక్రాంతి పండుగని
వేరే చెప్పాల!

ఇంటర్నెట్
 ఉందా
వెతుక్కున్నోనికి
వెతుక్కున్నంత!

NTR
YSR
అవసరానికి వాడుకోవడానికి
ఆటంబాంబు లాంటి సరుకు !!

నవరసాలు
ఒలికించాడ!
తప్పక నందమూరి
వంశం వాడైఉంటాడు!!

బూట్ల రేట్లకు
రెక్కలొచ్చాయ్
పాదయాత్రల
సీజన్ మరి!!


మహి పొట్టికవితలు

మహి పొట్టికవితలు
భక్తి పరాకాష్టకు
చేరుకుంది
యుగాంతం
దెబ్బకు!!



తెలుగు సినిమా పేర్లకు
ఆంగ్ల బూజు
తెలుగోనికి
దులిపే సమయం ఆసన్నమైంది!!

కుక్కకూ
కోపం వస్తుంది?
అవిశ్వాసం
అంటే అంతేమరి!!

పేరు కే
మార్నింగ్ వాక్
కాళ్ళ కన్నా
నోటికే పని ఎక్కువ!!

December 20, 2012

నా తెలుగు భాష

నా తెలుగు భాష

తర తరాల నా భాష 
తరగి పోనిది నా భాష
దేశ భాషలందు నా భాష
లెస్స అయినది నా భాష
జనపదాల జీవ భాష
బహు ప్రాచీనమైన భాష
అందమైన కావ్య భాష
పదునైన పద్య భాష
కవిత్రయముగ నాభాష
పరిఢవిల్లెను నా భాష
తరతరాల గని నా భాష
తరగని పెన్నిధి నా భాష !!