July 12, 2016

మహీ నానీలు

అమరావతి
చుట్టూ
రాజకీయం
ఎవరి లెక్కలు వాళ్ళవి మరి!!

రాష్ట్రంలో 
కులగజ్జి 
మందు లేదు
నివారణే మార్గం!!

June 25, 2016

మహీ -రెక్కలు


సంసారం
సాగరం
రెండూ
ఒకటే
        లోతెంతో
         ఎవరికీ తెలియదు!!

స్కానింగ్ లో
తెలిసింది
అమ్మాయి
అని
          చిదిమేశారు
           కలికాలపు కర్కశత్వం!!

June 24, 2016

మహీ నానీలు.

చీమల
బారు 
వంటింట్లో 
బేజారు!

లంకంత ఇల్లు 
బిక్కు బిక్కంటూ
భార్యా భర్త
ఉమ్మడి కుటుంబాలు విఛ్ఛిన్నం!!