October 17, 2013

బందులు-వెతలు

బందులు-వెతలు
సీమాంధ్రా ప్రజలారా
సమైక్యాంధ్ర వీరులారా
ఊరూరా బంద్ చూడరో
ఓ సీమాంధ్రోడా
ఉద్యమాల అగ్ని చూడరో
ఓ సీమాంద్రోడా
బస్తీ కి పోదామంటే
బస్సూలు లేకపోయే
బడి కీ వెల్లాలంటే
అయ్యవార్లు రారాయే
వీధులన్ని నిండి పోయెరో
ఓ సీమాంధ్రోడా
ఆఫీసులన్నీ ఖాళీ అయ్యెరో
ఓ సీమాంధ్రోడా
.........సరిగ్గా అప్పుడే రాజకీయుల డ్రామాలు...
రాజకీయ నాయకుల
దొంగ-కొంగ దీక్షలు
రాక్షసంగ మిమ్ములను
కుళ్ళబొడిచిరి చూడు
కిరణ్ రెడ్డి హామీతో
కిమ్మనకుండా దిగివచ్చి
ఉద్యోగాల్లో చేరినారురో
ఓ సీమాంధ్రోడ
ఎవ"రాట"వారు ఆడినారురో
ఓసీమాంధ్రోడా
బస్సుల్లేక రోడ్లన్ని
బక్కచిక్కి పోయాయి
ప్రైవేటు వాహనాలు
పొట్టపగల తిన్నాయి
ఎవరిసొమ్ము పోయిందిరో
ఓసీమాంధ్రోడా
ఎవరి నడ్డి విరిగిందిరో
ఓ సీమాంధ్రోడా
వీరివన్ని నాటకాలురో
ఓసీమాంధ్రోడా
మీ త్యాగాలన్ని వృధా అయ్యెరో
ఓసీమాంధ్రోడా
మన ఆశలన్ని ఆవిరయ్యెరో
ఓసీమాంధ్రోడా
ఇకనైనా కళ్లుతెరువరో
ఓసీమాంధ్రోడా
మనకోసం ఎవరులేరురో
ఓసీమాంధ్రోడా
మన ప్రాప్తం ఇలా ఉందిరో
ఓసీమాంధ్రోడా
మనగోడు తగులుతుందిరో
ఓసీమాంధ్రోడా
ఓటు బుల్లెట్ దిగుతుందిరో
ఓసీమాంధ్రోడా......
.........ఆశతో...జై ..సమైక్యాంధ్ర.........

October 1, 2013

మా తాత శ్రీ యల్లాల జంగమరెడ్డి గారి స్ఫూర్తితో

మా తాత గారి స్ఫూర్తితో

నేను రాస్తున్న కవితలన్ని
మా తాత యల్లాల జంగమరెడ్డి గారి
ఆశీశ్శుల వలన,ఆయన చూపించిన
దారిలోవెల్లడంవల్ల,స్ఫూర్తి పొంది
సమాజంలో జరుగుతున్న
విషయాలను,పరిశీలిస్తూ,అప్పటికప్పుడు
రాయడంజరుగుతూ ఉంటుంది
కొన్ని కవితలు విమర్శలకు
గురవుతూ ఉంటాయి,నేర్చుకోవలసినది
చాలా ఉంది..సద్విమర్శలను ఆహ్వానిస్తూ
మీ మెచ్చుకోలును ఆస్వాదిస్తూ..
..మా తాత గారి వర్ధంతి సంధర్భంగా ఆయనకు
........అంజలి ఘటిస్తూ...........మీ బ్లాగు మిత్రుడు
                                                ...కటారు.మహేశ్వర రెడ్డి

September 27, 2013

సమైక్య గీతం

సమైక్య గీతం
నా రాష్ట్రం సమైక్య రాష్ట్రం
నా గీతం సమైక్య గీతం
నా వాదం సమైక్య వాదం
నా లక్ష్యం సమైక్య రాష్ట్రం!
తెలుగుతల్లి బిడ్డలము
భరతమాత వీరులము!
తెలంగాణా పేరుతో
తెలుగుజాతిని చీల్చొద్దు!
రాష్ట్ర విభజన నెపంతో
రాష్ట్రాన్ని విడగొట్టొద్దు!
పచ్చదనాల ఆంధ్రప్రదేశ్ ను
ప్రాంతాలుగ విడదీసే పాపుల్లారా!
క్రిష్ణ,గోదావరి,తుంగభద్రలను
విడదీసే విద్రోహుల్లారా!
భావితరాల భవిష్యత్ ను
నాశనం చేసే గుంటనక్కల్లారా!
స్వార్ఠం వీడండి!మోసం మానండి!
రండి కదలండి!ఏకంకండి!
సమైక్యాంధ్ర సాధన కోసం
ఉద్యమించండి!ఊపిరులూదండి!!
.......జై సమైక్యాంధ్ర..జైజై సమైక్యాంధ్ర...........

August 4, 2013

వైయస్సార్ యుగం

వైయస్సార్ యుగం
రాజశేఖరా!జన హ్రుదయశేఖరా
అఖిలాంధ్ర ప్రజల అమర శేఖరా!
ప్రతి ఉదయం మీ చిరునవ్వు ముఖచిత్రం
చూసి మురిసి పోయే వాళ్ళం!
మీ దక్షతను మేము అనుసరించే వాళ్ళం!
"వై యస్సా ర్" అనే మూడు అక్షరాలు
అభిమానుల గొంతుల్లో పలికే
మంత్ర బీజాక్షరాలుగా వర్ణించే వాళ్ళం!
అన్నా!అని పిలిచే అక్కా చెళ్ళెల్లు
తాతయ్య అని ముద్దుగా పిలిచే
చిట్టి మనవళ్ళు!
ఒకరేమిటి! ఎటువైపు చూచినా
వై యస్సా ర్ వెంట నడిచే
జన ప్రభంజనాలు!
ఇంత ప్రేమ పెంచుకున్న నీ పై
విధి పగబట్టి మా నుంచి మిమ్ము దూరం చేసింది!
అఖిలాంద్ర ప్రజల గుండెలు బద్దలు చేసింది!
మీరు లేని ఈ రాష్ట్రంలో ఎటువైపు చూచినా అలజడులే!
మీరు లేరనే దిగులుతో కోట్లాది ప్రజల ఆశలు ఆవిరయ్యాయి!
అన్నా!నీవులేని రాష్ట్రం నిర్జీవం!
మీ చిరునవ్వు లేకపోవడం మా దురద్రుష్టం!
"కానీ కారు చీకట్లో కాంతి రేఖలా
ఒక తార మెరుస్తూ ఉంది!"
ఆ తారా బలానికి మీ ఆశీశ్సులు తోడైతే
మన రాష్ట్రం "సుజలాం-సుఫలాం-సస్యశ్యామలాం"
 

June 12, 2013

పొట్టి కవితలు

పొట్టి కవితలు
సంప్రదాయ
ఆటలు
వీడియో గేమ్స్
చక్రాల క్రింద పడి
నలిగిపోయాయి!!

మా ఇంటి
చూరులో పిచ్చుకలు
బిక్క చచ్చి ఉన్నాయి
సెల్ బాంబ్ పేలుతుందేమోనని!!

వేమన శతకాలు
సచిన్ శతకాలు
సమకాలీన ప్రపంచానికి
ఆదర్శ పాఠాలు!!

పద భంగం
చేసే కన్నా
అక్షర హత్యలు
చేసే కన్నా
చేతులు ముడుచుకొని
కూర్చునేది మేలు!!

విక్రమార్కులు లేరు
అక్రమార్కులు లేరు
ఉన్నదంతా
వక్రమార్కులే!!

విదేశీయులు
భారత్ రావడం లేదా?
ఆయితే మన సంస్కృతి
వారికి బాగా అర్థమయినట్లుంది!!!

April 9, 2013

విజయ నామ సంవత్సర ఉగాది

విజయీభవ

విజయ నామ సంవత్సరం
విజయానికి సంకేతం
తెలుగు నేల పులకిస్తోంది
వేప పూత విరగకాస్తోంది
మామిడి పిందెలు
మురిపిస్తున్నాయ్
చింత-జీలకర్ర
ఊరిస్తున్నాయ్
జీడిపప్పు -బెల్లం
అన్నీ ఉన్నాయ్
ఇక పదండి షడ్రుచుల
ఉగాది పచ్చడి
దిగ్విజయంగా తయారు చేసి
విజయ నామ సంవత్సరానికి
స్వాగతం పలకండి!!!



ఉఉఅ

April 8, 2013

వివహ బంధం

వివాహ బంధం
వివాహ బంధం
పవిత్ర బంధం
భారతీయ సంస్కృతిలో
ముచ్చటైన బంధం
ఎక్కడో పుట్టిన అమ్మాయి
ఎక్కడో పుట్టిన అబ్బాయి
అటు ఏడు తరాలు
ఇటు ఏడు తరాలు
సరి చూచుకొని నిర్ణ యించిన
అపురూప బంధం
దేవుడు కలిపిన
ఈ అను బంధాలను
శాశ్వత బంధంగా 
నిలుపుకోండి
ఆనందమయంగా 
జీవించండి !!!!!



March 1, 2013

గులాబి పూవు

గులాబి పూవు

సృష్టిలో గులాబీ పూవు ప్రత్యేకం
సుకుమారత్వానికి ప్రతిరూపం గులాబి
రవివర్మకు అంతుచిక్కని మిస్టరి
దాగుంది ఈగులాబీలో
మోనాలీసా పెదవుల కన్నా మెత్తదనం
గులాబీ పూ రెక్కలది
ఇంద్రధనుస్సు లోని అన్ని వర్ణాలు
కలిపినా గులాబీ ముందు
తేలి పోవలిసిందే
గులాబీ రెక్కలపై పడిన
మంచు బిందువులు కోహినూర్ వజ్రం
కంటే కాంతులీనుతాయి
ప్రేమకు మంచి రాయబారి గులాబి
అందుకే ప్రకృతి సృష్టించిన
అందాలను చూడవలసిందే
కానీ కృత్రిమ సృష్టి చేసే
సాహసం చేయకు సుమీ!!!

February 22, 2013

టెర్రాక్షసుల పైశాచికం

టె ’ర్రా’క్షసుల పైశాచికం 21/2

ఒక్క క్షణం
హైదరాబాద్ తో పాటు
ప్రపంచమంతా ఉలిక్కి పడింది!
ఏం జరిగింది?
అత్యాధునిక సమాజంలో
అద్భుతమైన సాంకేతిక యుగంలో
ఎంత భద్రత ఉన్నా
అందరి ఎత్తులు చిత్తు చేస్తూ
మరణమృదంగం వాయించిన
ముష్కరుల మారణహోమానికి
భాగ్యనగరి మళ్ళీ దాసోహమంది!
ఎందుకు ఇలా?
ప్రశ్నించి ఏంలాభం!
మళ్ళీ  ఏ సంవత్సరానికో
రెండేళ్ళకో ఏదో ఒక ప్రాంతంలో
మళ్ళీ మామూలే!
ఎక్స్ గ్రేషియాలు,పరామర్శలు
మీడియాలో చర్చోపచర్చలు
కేవలం ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి!
ప్రజల తలరాతలు మాత్రం అంతే!!
ఈ మారణ హోమంలో సమిధలైన
తోటి నా భారతీయ ముద్దు బిడ్డలకు అంజలి ఘటిస్తూ .................
                                                                                            !

February 15, 2013

కలియుగ వైకుంఠం


కలియుగ వైకుంఠం

తిరుపతి అందాలు
గోవిందునిలీలలు!
కపిల తీర్ధాలు
సర్వపాప హరణాలు!
అలిపిరి ప్రభలు
భక్తికి వెలుగులు!
కాలినడకన భక్తులు
శ్రీ వేంకటేషుకై మొక్కులు!
శంఖ చక్రాలు
విశ్వానికి రక్షాకవచాలు!
మోకాళ్ళ పర్వతం మెట్లు
భక్తుల బంగారు భవిష్యత్ కు సోపానాలు!
తిరుమల గిరులు
కలియుగ సిరులు!
వైకుంఠ ప్రవేశద్వారాలు
మోక్షానికి ముఖద్వారాలు !
కన్నులారా గాంచితి నా వేంకటేశ్వరుని నిజదర్శనం
ఎన్నో జన్మజన్మల చేసుకున్న పుణ్యఫలం!!!


February 7, 2013

ఒక్క సారి ఆలోచించండి

ఒక్క సారి ఆలోచించండి

అవును ఒక్కసారి ఆలోచించండి?

రోజుకు ఒక్కపూటైనా తిండిలేని వారి గురించి

ఒక్క సారి గమనించండి ?

లేత చేతులతో బొబ్బలు ఎక్కేలా
పని చేస్తున్న బాల కార్మికుల గురించి

ఒక్క సారి బాధపడండి ?

అమ్మా-నాన్నలు లేని అనాధల గురించి

ఒక్క  సారి     పరీక్షించండి ?

ఒంట్లో సత్తువ లేని దీనావస్థలో
ఉన్న వృద్ధుల గురించి

ఒక్క సారి ప్రార్థన చేయండి!

సమస్త విశ్వంలోని ప్రాణికోటికి
సాయం అందించమని......!!

లోకా స్సమస్తా సుఖి:నోభవంతు!!!

January 29, 2013

నా పల్లె జ్ఞాపకాలు

నా పల్లె జ్ఞాపకాలు

నేడు కాలం
పరిగెడుతోంది....పరిగెడుతోంది!

గత జ్ఞాపకాల
దొంతరలను చెరిపేస్తు...మరిపిస్తూ!
ఏవీ!నాటి నా పల్లెసీమల
మట్టి పరిమళాలు!
నేను తిన్న జొన్న కుడుములు
రాగి ముద్దలు అంటరానివైన వైనం!
మా ఎడ్లబండ్లు
పాడిగేదెలు అక్కరకురాని వైనం!
పొలం గట్లు-కలం దొడ్లు
అమ్మలక్కల ఉబుసుపోల కబుర్లు!
ఆకాశవాణి  కార్యక్రమాలు
విందామంటే కనపడని రేడియోలు!
నా పల్లె "రచ్చబండ"
టి.వీ లధాటికి మూగబోయింది!
ఏ వైపు చూసినా కానరాని
ఆ నాటి మానవ సంబంధాలు!
కానీ! ఏదో ఒక రోజు
నా పల్లె కోసం పరుగెత్తే రోజొస్తుంది!
అందుకే నా పల్లె జ్ఞాపకాలు సజీవం...సశేషం...!!!

January 18, 2013

మా చిన్నారి సైన్యం

మా చిన్నారి సైన్యం

బుడి బుడి నడకల బుడతలు వీరు
ముద్దుముద్దు పలుకుల చిలుకలు వీరు
మా ఇంటి పెరటి పూబంతులు వీరు  
 అమాయ కత్వపు ఆప్తులు వీరు 
 ఆటల పాటల ఆడుకొందురు 
 వీనుల విందుగ పాడుకొందురు 
అలసిపోని ఆ చిన్నారి బాలలు
గలగల పారే సెలయేళ్ళు
లోకం తెలియని బాలలు వారు
అందరిలో ఆనందం వీరు
కళ్ళా కపటం తెలియని వీరు 
చిట్టి చిట్టి సామ్రాజ్యపు వారసులు


ఈ చిచ్చర పిడుగులు!!!

నే చూచిన సంక్రాంతి

నే చూచిన సంక్రాంతి 


మకర సంక్రాంతి వచ్చింది
కళా విహీనంగా కదలి వచ్చింది
రైతుల కళ్ళల్లో కాంతి లేకుండా
పేదవారి ఇళ్ళల్లో పొయ్యి వెలుగా కుండా
ఎవరికి సంక్రాంతి ఎందుకు సంక్రాంతి?
నే చూచిన మనుషుల్లో లేదు సంక్రాంతి!
రెప్పల మాటున కన్నీటి కలశాలు
క్రొత్త బట్టలు లేవు,పిండి వంటలుకరవు
ఎవరికీ చెప్పుకోలేని మూగరోదనలు
ఎవరికి సంక్రాంతి ఎందుకు సంక్రాంతి?
పేద ధనికుల మధ్య ఎంతో వ్యత్యాసం
పండుగలంటేనే ఎంతో భారం
ఆడంబరాల యుగంలో
అంతులేని ఆవేదనతో
ఎందుకు సంక్రాంతి ఎవరికి సంక్రాంతి?
ఒక్కరోజు పండుగకే చచ్చి బ్రతికే మనం
మూడు రోజుల పండుగలు ముచ్చెమటలు పట్టిస్తాయి
ధరాఘాతాలు ఒక వైపు,కనీస అవసరాలు మరోవైపు
పండుగ పూటైనా పరమాన్నం తినాలనే ఆత్రం
నిజంగా ఎవరికి సంక్రాంతి ఎందుకు సంక్రాంతి???

January 11, 2013

శివారెడ్డి

శివారెడ్డి యోగా మాస్టర్ ఆదిత్య బిర్లా పబ్లిక్ స్కూల్