January 29, 2013

నా పల్లె జ్ఞాపకాలు

నా పల్లె జ్ఞాపకాలు

నేడు కాలం
పరిగెడుతోంది....పరిగెడుతోంది!

గత జ్ఞాపకాల
దొంతరలను చెరిపేస్తు...మరిపిస్తూ!
ఏవీ!నాటి నా పల్లెసీమల
మట్టి పరిమళాలు!
నేను తిన్న జొన్న కుడుములు
రాగి ముద్దలు అంటరానివైన వైనం!
మా ఎడ్లబండ్లు
పాడిగేదెలు అక్కరకురాని వైనం!
పొలం గట్లు-కలం దొడ్లు
అమ్మలక్కల ఉబుసుపోల కబుర్లు!
ఆకాశవాణి  కార్యక్రమాలు
విందామంటే కనపడని రేడియోలు!
నా పల్లె "రచ్చబండ"
టి.వీ లధాటికి మూగబోయింది!
ఏ వైపు చూసినా కానరాని
ఆ నాటి మానవ సంబంధాలు!
కానీ! ఏదో ఒక రోజు
నా పల్లె కోసం పరుగెత్తే రోజొస్తుంది!
అందుకే నా పల్లె జ్ఞాపకాలు సజీవం...సశేషం...!!!

January 18, 2013

మా చిన్నారి సైన్యం

మా చిన్నారి సైన్యం

బుడి బుడి నడకల బుడతలు వీరు
ముద్దుముద్దు పలుకుల చిలుకలు వీరు
మా ఇంటి పెరటి పూబంతులు వీరు  
 అమాయ కత్వపు ఆప్తులు వీరు 
 ఆటల పాటల ఆడుకొందురు 
 వీనుల విందుగ పాడుకొందురు 
అలసిపోని ఆ చిన్నారి బాలలు
గలగల పారే సెలయేళ్ళు
లోకం తెలియని బాలలు వారు
అందరిలో ఆనందం వీరు
కళ్ళా కపటం తెలియని వీరు 
చిట్టి చిట్టి సామ్రాజ్యపు వారసులు


ఈ చిచ్చర పిడుగులు!!!

నే చూచిన సంక్రాంతి

నే చూచిన సంక్రాంతి 


మకర సంక్రాంతి వచ్చింది
కళా విహీనంగా కదలి వచ్చింది
రైతుల కళ్ళల్లో కాంతి లేకుండా
పేదవారి ఇళ్ళల్లో పొయ్యి వెలుగా కుండా
ఎవరికి సంక్రాంతి ఎందుకు సంక్రాంతి?
నే చూచిన మనుషుల్లో లేదు సంక్రాంతి!
రెప్పల మాటున కన్నీటి కలశాలు
క్రొత్త బట్టలు లేవు,పిండి వంటలుకరవు
ఎవరికీ చెప్పుకోలేని మూగరోదనలు
ఎవరికి సంక్రాంతి ఎందుకు సంక్రాంతి?
పేద ధనికుల మధ్య ఎంతో వ్యత్యాసం
పండుగలంటేనే ఎంతో భారం
ఆడంబరాల యుగంలో
అంతులేని ఆవేదనతో
ఎందుకు సంక్రాంతి ఎవరికి సంక్రాంతి?
ఒక్కరోజు పండుగకే చచ్చి బ్రతికే మనం
మూడు రోజుల పండుగలు ముచ్చెమటలు పట్టిస్తాయి
ధరాఘాతాలు ఒక వైపు,కనీస అవసరాలు మరోవైపు
పండుగ పూటైనా పరమాన్నం తినాలనే ఆత్రం
నిజంగా ఎవరికి సంక్రాంతి ఎందుకు సంక్రాంతి???

January 11, 2013

శివారెడ్డి

శివారెడ్డి యోగా మాస్టర్ ఆదిత్య బిర్లా పబ్లిక్ స్కూల్