January 18, 2013

నే చూచిన సంక్రాంతి

నే చూచిన సంక్రాంతి 


మకర సంక్రాంతి వచ్చింది
కళా విహీనంగా కదలి వచ్చింది
రైతుల కళ్ళల్లో కాంతి లేకుండా
పేదవారి ఇళ్ళల్లో పొయ్యి వెలుగా కుండా
ఎవరికి సంక్రాంతి ఎందుకు సంక్రాంతి?
నే చూచిన మనుషుల్లో లేదు సంక్రాంతి!
రెప్పల మాటున కన్నీటి కలశాలు
క్రొత్త బట్టలు లేవు,పిండి వంటలుకరవు
ఎవరికీ చెప్పుకోలేని మూగరోదనలు
ఎవరికి సంక్రాంతి ఎందుకు సంక్రాంతి?
పేద ధనికుల మధ్య ఎంతో వ్యత్యాసం
పండుగలంటేనే ఎంతో భారం
ఆడంబరాల యుగంలో
అంతులేని ఆవేదనతో
ఎందుకు సంక్రాంతి ఎవరికి సంక్రాంతి?
ఒక్కరోజు పండుగకే చచ్చి బ్రతికే మనం
మూడు రోజుల పండుగలు ముచ్చెమటలు పట్టిస్తాయి
ధరాఘాతాలు ఒక వైపు,కనీస అవసరాలు మరోవైపు
పండుగ పూటైనా పరమాన్నం తినాలనే ఆత్రం
నిజంగా ఎవరికి సంక్రాంతి ఎందుకు సంక్రాంతి???

No comments: