October 24, 2008

రాయలసీమ ఆక్రందన

రాయలేలిన సీమలో రక్త ప్రవాహాలు

రతనాల సీమలో బాంబుల మోతలు!!

పాళెగాళ్ళ ధాటికి తెగిపడిన తలలెన్నో

రాక్షస రాజకీయానికి బలి అయిన సమిధలెన్నో!!

రెక్కాడితే గాని, డొక్కాడని బడుగు జీవితాలు

దొరల అనుచరులుగా అశువులు బాస్తున్న జీవచ్ఛవాలు!

నేతల మంది మార్బలం-ఆధిపత్యం అనుక్షణం!

అధినేతల గుప్పిట్లో అధికారుల శాసనం-

ఎలా నిలువ రించగలమని అధికారుల ఆగ్రహం!!

సీమ ప్రజల హృదయ ఘోష వినే వారెవ్వరు-

చీకట్లో చిరుదీపం వెలిగించే దెవ్వరు!!

ఓ! రాయలసీమ వితంతువా అరచి అరచి

గొంతు మూగ బోయిందా!

యేడ్చి యేడ్చి గుండె బరువెక్కిందా!!

నిను చూచి నీ చిన్నారుల చితికిన బ్రతుకును-

చూచైనా వీరికి కనువిప్పు కలుగుతుందా!!
_ ౦౦౦_

1 comment:

Kathi Mahesh Kumar said...

అయ్యా మహేష్ గారూ, మీది నిజంగా రాయలసీమేనా! లేక ఫ్యాక్షన్ సినిమాలు చూసి స్పందించి కవితరాసారా? కాస్త చెబుదురూ..