October 17, 2014

జన్మభూమి -- మా ఊరు

రండి కదలి రండి
జన్మభూమి పిలుస్తోంది
రండి కలసి రండి
ఉన్న ఊరు అడుగుతోంది!

 చేయి చేయి కలిపిమనం
చరిత్రనే సృష్టిద్దాం
”అన్న” గారి అడుగుల్లో
అడుగులు వేసేద్దాం
”తాడిపత్రి” గొప్పతనం
జగమంతా చాటేద్దాం!!
                          || రండి||
పచ్చదనం - పరిశుభ్రత
ప్రగతికి తొలిమెట్టు
కష్టాలెన్నున్నా
జన్మభూమిని నిలబెట్టు
” స్వచ్ఛ తాడిపత్రి” వాసిగా
సగర్వంగా తల పైకెత్తు !!
                                      # కటారు.మహేశ్వర్ రెడ్డి.
                                        .శ్రీ సత్యసాయి తెలుగుపండిత శిక్షణ కళాశాల.
                                          తాడిపత్రి..

1 comment:

Ravi said...

చాలా బాగా అల్లారు పద్యాన్ని. దానికి సంగీతం కూడా తోడు చేసి ఒక మంచి పాటలా మార్చవచ్చు